
ఐరాస సర్వప్రతినిధి సభ 75వ వార్షిక సమావేశంలో భారత్ స్వరం బలంగా వినిపించిన ప్రధాని మోదీ !మేము బలంగా ఉన్నప్పుడు, ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టలేదు.
మేము బలహీనంగా ఉన్నప్పుడు ప్రపంచానికి భారంగా మారలేదు.
జనాభాలో 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం మాది. ఒక దేశంలో జరుగుతున్న మార్పులు ప్రపంచంలోని పెద్ద భాగాన్ని ప్రభావితం చేసేటప్పుడు ఆ దేశం ఎన్ని రోజులని వేచి ఉండాలి?
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఐరాస భద్రతా మండలిలో నిర్ణయాధికారానికి ఇంకెంతకాలం దూరంగా ఉంటుంది?