ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖతార్ దేశ ఎమిర్ గౌరవనీయులు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని తో టెలిఫోనులో మాట్లాడారు.
COVID-19 కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో సంఘీభావం మరియు మద్దతు ఇచ్చినందుకు Narendra Modi ధన్యవాదాలు తెలిపారు.
ఖతార్ లో నివసిస్తూ, పనిచేస్తున్న భారత జాతీయుల సంక్షేమంపై ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో వారు చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్దకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఖతార్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల రక్షణ, సంక్షేమం గురించి గౌరవనీయులైన ఎమిర్, ప్రధానమంత్రికి హామీ ఇచ్చారు.