రాంచీలో, మేము జర్మనీ నుండి 3డి నిర్మాణ వ్యవస్థను ఉపయోగిస్తున్నాము. ఈ నమూనాలో, ప్రతి గది విడిగా నిర్మించబడుతుంది మరియు తరువాత మొత్తం నిర్మాణం లెగో బ్లాకుల వలె అనుసంధానించబడుతుంది.
అగర్తాలాలో న్యూజిలాండ్ నుండి స్టీల్ ఫ్రేమ్ టెక్నాలజీని ఉపయోగించి గృహాలను నిర్మిస్తున్నాము.
భూకంపాల యొక్క శాశ్వత ప్రమాదం నుండి నిరోధించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
RERA ప్రజలకు మళ్లీ రియాలిటీ ప్రాజెక్టులపై నమ్మకాన్ని మరియు ప్రాజెక్టులు పూర్తవుతాయన్న విశ్వాసం కలిగించాయి. నేడు, 60,000 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు RERA కింద నమోదు చేయబడ్డాయి. వేలాది కేసులు కూడా చట్టం ప్రకారం పరిష్కరించబడ్డాయి.
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి మేము నిరంతరం నిర్ణయాలు తీసుకుంటున్నాము. కొనుగోలుదారులను ప్రోత్సహించడానికి హౌసింగ్ టాక్స్ కూడా తగ్గించాము.
చౌక గృహాలపై 8% వద్ద ఉన్న పన్ను నేడు కేవలం 1% మాత్రమే.సగటు గృహాలలో, పన్ను 12% నుండి 5% వద్దకు తీసుకొచ్చాo.