కేంద్ర హోమ్ శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారిని ఈ రోజు కలవడమైనది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లి, దాదాపు 20 నిముషాల పాటు చర్చించడమైనది.
అనంతరం, తీన్మార్ మల్లన్న సతీమణి శ్రీమతి మాతమ్మ మరియు సోదరుడు వెంకటేష్ గార్లు ఈ రోజు కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. కెసిఆర్ ప్రభుత్వం ఏ విధంగా మల్లన్నపై ఒకే ఆరోపణపై 35కి పైగా దొంగ కేసులు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తుందో, దీనిపై హైకోర్ట్ ఆగ్రహించి, మల్లన్న జైలు నుంచి విడుదల కాకుండా ఉండేలా పోలీసులు పీటీ వారెంట్లను అమలు చేస్తున్నట్లుగా అర్థమవు తోందని పేర్కొని, ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన విషయాన్ని కూడా వినతి పత్రంలో పేర్కొన్నారు.