ఈరోజు సహచర ఎంపీ లు శ్రీ బండి సంజయ్ గారు & శ్రీ సోయం బాపు రావ్ గారితో కలిసి పార్లమెంటులో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారితో భేటీ అవ్వడం జరిగింది.
ఈ సమావేశంలో గతేడాది కురిసిన అకాల వర్షాల వల్ల పసుపు పంటకు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించి రైతులకు పరిహారం అందించడంపై చర్చించడం జరిగింది . తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకపోవడంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎంపీ ల బృందం పీయుష్ గోయల్ గారికి వివరించడం జరిగింది. దీనికి గౌరవనీయులైన మంత్రి గారు కూడా PMFBYని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకపోవడం పట్ల నిరాశను వ్యక్తం చేశారు మరియు పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదన రావాలని తెలియచేశారు.