భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో, గాంధీనగర్ వాక్సినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. 11 మరియు 12 వార్డు ప్రజలకు కరోనా పై అవగాహన మరియు వ్యాక్సినేషన్ ఆవశ్యకతను వివరించి నీళ్ళు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్ ,జిల్లా ఉపాధ్యక్షులు గుడాల రాజేష్ గౌడ్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు ఆలగుర్తి లక్ష్మీ నారాయణ స్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపురం సాయి కృష్ణ ,పట్టణ ఉపాధ్యక్షులు అత్తినేని ఉత్తమ్, పట్టణ కార్యదర్శి ఉలిసే శ్రీనివాస్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి చుక్కల ప్రేమసాగర్, పట్టణ దళిత మోర్చా అధ్యక్షులు నక్క జీవన్, నాయకులు సుద్దాల విజయ్ లింగంపల్లి పవన్,కుర్మా రమేష్, నక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.