భారీ వర్షాల కారణంగా పూర్తిగా తెగిన జక్రాన్ పల్లి మండలం పడకల్ పెద్ద చెరువుని ఈరోజు స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులతో పరిశీలించడం జరిగింది. కట్ట తెగడంతో 200 ఎకరాలకు పైగా పంటనష్టపోయింది.
పంట నష్టం పై కేంద్ర ప్రభుత్వం ద్వారా సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన హైపర్ కమిటీ పంట నష్టాన్ని పరిశీలన చేసి, స్వయంగా అంచనా వేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లాంటి పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం కళ్లు తెరిచి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలుపరిచి రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నాను.
