Published On 5 Jul, 2021
బిజెపి జగ్తీయల్ రూరల్ మండల్ వింగ్ ప్రధాని మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది




ఈరోజు బీజేపీ జగిత్యాల రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో కల్లెడ నుండి గుట్టరాజుపల్లె మరియు లక్ష్మీపూర్ వరకు ప్రధాన్ మంత్రి గ్రామీణ్ సడక్ యోజన పథకం కింద 3 కోట్ల 38 లక్షలతో 7.08 కి మీ రోడ్డును మంజూరు చేసిన ప్రధాని మోడీ గారి చిత్రపటానికి కల్లెడ గ్రామంలో పాలాభిషేకం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, జిల్లా కార్యదర్శి బొడ్డు గంగారం మండల కార్యదర్శి మేసు వెంకటేష్,మండల బిసి సెల్ అధ్యక్షులు బొడ్డు రవి, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు తాళ్ల శ్రీనివాస్, కిసాన్ మోర్చా కార్యదర్శి గడ్డం మల్లారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పత్తి రామేశ్వరి, బీజేవైఎం కార్యదర్శి చేను శ్రీకాంత్, కల్లెడ బూత్ అధ్యక్షుడు రాచకొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts