Published On 12 Jul, 2022
నియోజకవర్గ నాయకులు మరియు మండల అధ్యక్షులతో జూమ్ సమావేశం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లాల నియోజకవర్గ నాయకులు మరియు మండలాల అధ్యక్షులతో ఎంపీ జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ, ఇరు జిల్లాల కలెక్టర్లతో పర్యవేక్షణ చేస్తున్నానని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పునరావాస కేంద్రాల్లో భోజనము, బట్టలు, దుప్పట్లు అందజేసేలా చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే నా కార్యాలయ సిబ్బందిని సంప్రదించి తక్షణమే నా దృష్టికి తీసుకురావాలని కోరారు.

నాయకులందరూ వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్టం పై క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు నష్టపరిహారం అందించే విషయంలో అండగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ జూమ్ సమావేశంలో నిజామాబాద్ మరియు జగిత్యాల జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య, మోరెపల్లి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, నియోజకవర్గాల నాయకులు ధన్ పాల్ సూర్యనారాయణ, దినేష్ కులాచారి , మల్లికార్జున్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి, డాక్టర్ జెఎన్ వెంకట్,సాంబారి ప్రభాకర్, పార్లమెంట్ పరిధిలోని మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.

నియోజకవర్గ నాయకులు మరియు మండల అధ్యక్షులతో  జూమ్ సమావేశం

Related Posts