Published On 10 Aug, 2022
నగరంలోని 36వ డివిజన్‌లో గల ST హాస్టల్‌ను బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గారు ఆకస్మికంగా తనిఖి చేశారు

నగరంలోని 36వ డివిజన్‌లోగల ST హాస్టల్‌ను బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గారు ఆకస్మికంగా తనిఖి చేశారు. దుర్గంధమైన టాయిలెట్లు, నాసి రకం భోజనం తినలేక విద్యార్థులు బయట నుండి కూరలు, మంచినీళ్లు తెచ్చుకుంటున్నారని తెలిసి ధన్ పాల్ గారు చలించిపోయారు.

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు అన్నం, నీళ్లు కోసం రోజు కుస్తీలు పడేలా చేస్తున్న ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని, లేకపోతే బిజేపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొతాన్కర్ లక్ష్మీ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీ నారాయణ, కార్పొరేటర్ల మాస్టర్ శంకర్, ఎర్రం సుదీర్, బూరుగుల వినోద్, పంచరెడ్డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

నగరంలోని 36వ డివిజన్‌లో గల ST హాస్టల్‌ను బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ గారు ఆకస్మికంగా తనిఖి చేశారు

Related Posts