నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గల వేలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమల లోని అయ్యప్పస్వామి దర్శించుకునేందుకు వీలుగా ఆర్మూర్, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల మీదుగా శబరిమల కు ప్రత్యేక రైళ్లు నడపాలని ఇటీవల రైల్వే శాఖా మంత్రి గారిని కోరగా, నా యొక్క విజ్ఞప్తి మేరకు ఆర్మూర్, మెట్ పల్లి కోరుట్ల, జగిత్యాల మీదుగా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
అయ్యప్ప భక్తుల కోసం నా యొక్క విన్నపాన్ని పరిగణలోకి తీసుకొని, సానుకూలంగా స్పందించినందుకు రైల్వే శాఖ మంత్రి గారికి మరియు సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.