జన ఔషధి దివస్ సందర్భంగా ఈరోజు నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడ లో గల జన ఔషధి కేంద్రాన్ని సందర్శించాను. అతి తక్కువ ధరలో ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న మందుల గురించి పలువురు లబ్ధిదారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని డాక్టర్లందరూ జన ఔషధి కేంద్రాల గురించి విరివిగా ప్రచారం చేయాలని విన్నవించాను.
