కొంత మంది వ్యక్తులు తమ స్వార్థ అజెండాల కోసం కొన్ని సంఘటనల్లో మానవ హక్కుల ఉల్లంఘనపై నోరు విప్పుతారు, మరో చోట నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తారు.
మానవ హక్కులను రాజకీయ దృష్టితో చూసినప్పుడు, రాజకీయ లాభ-నష్టాల తరాజులో తూకం వేయబడినప్పుడు అవి పూర్తిగా ఉల్లంఘించబడతాయి.
అటువంటి ఎంపికతో కూడిన ప్రవర్తన ప్రజాస్వామ్యానికి కూడా చాలా హానికరం.