పసుపు రైతుని ఆదుకోండి !
అధిక వర్షాలతో దిగుబడి తగ్గి, తెగుళ్ల సమస్యతో, వచ్చిన దిగుబడికి కూడా ధర వచ్చేలా లేదని, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా కనిపించట్లేదని దిగాలు పడుతున్న పసుపు రైతులకు తక్షణమే పంట నష్టం అంచనాలు వేసి, పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి లేఖ వ్రాయడమైనది.
ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనని రాష్ట్రంలో అమలు చేసి ఉంటే, రైతులకు ఈ సమయంలో ఉపశమనం లభించి ఉండేది.