Published On 27 Jul, 2021
Jagtial BJP Kisan Morcha Stages Dharna On Farmers Issue
mp arvind dharmapuri news

ఈరోజు భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా, జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో రైతు గోస, రైతు సమస్యలపై ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు వెంటనే లక్ష రూపాయల రుణమాఫీ ని ఏకకాలంలో చేయాలని, 2018 ఎలక్షన్ లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని రైతులకు హామీ ఇచ్చి రైతులు 13% వడ్డీ కట్టవలసిన దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అని, జీరో వడ్డీ రుణాలను ఇస్తానని చెప్పి, రైతులపై వడ్డీభారాన్ని వేయడాన్ని బీజేపీ కిసాన్మోర్చా తీవ్రంగా ఖండిస్తోంది అని, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వెంటనే తెరిపించి రైతులకు, కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వం నడిపించలేని పక్షంలో ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించి రైతులను ఆదుకోవాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని, కేవలం నరేంద్ర మోడి గారికి పేరు వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే వాటాను చెల్లించక రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుంది అని ,కురిసిన వానలకు రైతుల పంట పొలాలు మునిగిపోయి, పొలాల్లో ఇసుక మేటలు పెట్టడం జరిగింది అని, వాటన్నిటికీ నష్టపరిహారం కింద 25 వేల రూపాయల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా చెల్లించాలని, రైతులకు ఇచ్చే సబ్సిడీ పనిముట్లను యంత్రాలను వెంటనే ఇవ్వాలని, నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలపై పీడీ యాక్ట్ పెట్టాలని ,వారికి అండదండగా ఉన్న ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి అని 2018 ఎలక్షన్ల కంటే ముందు రైతులకు శుభవార్త చెప్తాను అని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుని ఈ ప్రపంచమే ఆశ్చర్యపడే విషయాన్ని చెబుతానని, రైతులకు ఉచిత ఎరువులను అందిస్తాం అని చెప్పి, అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా రైతులకు ఎరువులు ఇవ్వకపోగా, కృత్రిమంగా యూరియా కొరత సృష్టించి అధిక ధరల కు అమ్మించడం జరుగుతుంది అని, రైతుల పంటపొలాల భూసార పరీక్షల ను వెంటనే చేయించాలని, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 120 కోట్ల రూపాయలను సక్రమంగా వినియోగించి, భూసార పరీక్షలు చేసి రైతులకు లాభం చేకూర్చాలని, బీజేపీ జగిత్యాల జిల్లా కిసాన్మోర్చా డిమాండ్ చేస్తుంది.

ఈ కార్యక్రమంలో బిజెపిరాష్ట్ర కోపరేటివ్ సెల్ కన్వీనర్ గంగారెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణ, జగన్ రెడ్డి బిజెపి పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా పదాధికారులు ముత్యం రెడ్డి, జలపతి రెడ్డి, రవీందర్ రెడ్డి, బండారు లక్ష్మణ్ , చంద్రశేఖర్ రెడ్డి, బుచ్చి రాములు, ముద్దం రాము, ఎస్ ఎన్ రెడ్డి , ముంజ శ్రీనివాస్, గడ్డం రమేష్ ,ఎండ బట్ల వరుణ్ కుమార్, మదన్మోహన్, జున్ను రాజేందర్ , మేదర వేణి రాజేందర్, కిసాన్మోర్చా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కిసాన్ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts