కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం భారత్ రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ CoWin ను అన్ని దేశాలకు ‘ఓపెన్ సోర్స్’ గా అందిస్తుందని నిన్న జరిగిన CoWIN గ్లోబల్ కాంక్లేవ్ లో ప్రధాని తెలిపారు.
ఈ సమావేశానికి 142 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఏదైనా దేశం తన ప్రభుత్వ రంగం అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్‌ను ప్రపంచానికి ఉచితంగా ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి.