ఎంపీ అర్వింద్ ధర్మపురి నేతృత్వంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు న్యూఢిల్లీలో ఆర్కే పురం, జంగ్‌పురా సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ రెండు స్థానాల్లో బీజేపీ గెలిచింది.
ప్రధాని నరేంద్ర మోడీ పనితీరును చూసే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిపించారని ధర్మపురి వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహా బృందంలో తనను చేర్చి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
