రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త..
ఎరువులపై రాయితీ భారీగా పెంపు.
రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా నిర్ణయంతో బస్తా డీఏపీ ఎరువుపై రూ.1650 రాయితీ లభించనుంది. ఇక యూరియాపై సబ్సీడీని రూ.1500 నుంచి రూ.2000లకు పెంచింది. ఎన్‌పీకే ఎరువుపై రూ.900 రాయితీ ఇస్తుండగా.. ఇప్పుడు దాన్ని రూ.1015 కు పెంచారు. ఎస్‌ఎస్‌బీపై రూ.315 సబ్సీడీ ఉండగా.. రూ.375కు పెంచారు.
‘‘అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరకే ఎరువులను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే డీఏపీ, యూరియా సహా పలు ఎరువులపై రాయితీని పెంచాం. రబీ సీజన్‌లో ఎరువులపై సబ్సిడీ కోసం ప్రధాని మోదీ రూ.28వేల కోట్లు కేటాయించారు. దీని వల్ల రైతులపై ఎలాంటి భారం పడదని, అప్పుడు పంటలు సమృద్ధిగా పండుతాయని మోదీ ఆశిస్తున్నారు’’ అని మన్‌సుఖ్ మాండవీయ వివరించారు.