జగిత్యాల పట్టణంలోని ఐడిఓసి కార్యాలయంలో జరిగిన జగిత్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో చైర్మన్ హోదాలో పాల్గొని పలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై రివ్యూ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశాను. నాతోపాటు ఈ సమావేశంలో జగిత్యాల మరియు ధర్మపురి శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఐఏఎస్ గారు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
