Published On 12 May, 2022
1100 కోట్ల రూపాయల వ్యయంతో రెండు జాతీయ రహదారులు నిర్మిస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం !

నిజామాబాద్‌ పార్లమెంట్ సెగ్మెంట్‌

నిజామాబాద్‌ పార్లమెంట్ సెగ్మెంట్‌ అభివృద్దికి ఎంపీ అర్వింద్ చేసిందేం లేదు, కేంద్రం ఇచ్చిందేం లేదు అంటూ.. అసలు అక్కడ జరుగుతున్న అభివృద్ధిలో కేంద్రం వాటా యే లేదు అని నోటికొచ్చినట్టు వాగుతున్నారు తెలివి లేని టీఆర్ఎస్ నాయకులు . నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అర్వింద్ ఏం చేశారో, కేంద్రం నుంచి ఎంత తీసుకొచ్చారో చెబితే చాలు టీఆర్ఎస్ నాయకుల అబద్దాలన్ని బయటపడతాయి. ఒక్క రహదారుల సంగతే చూసుకుంటే 1100 కోట్ల రూపాయల వ్యయంతో రెండు జాతీయ రహదారులు నిర్మిస్తోంది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ రెండు జాతీయ రహదారులలో ఒకటి మద్నూర్‌-బోధన్‌ రూట్ కాగా, రెండోది బోధన్‌-నిజామాబాద్‌ రూట్. ఈ రెండు రూట్లలో నేషనల్ హైవే నిర్మాణానికి 1100 కోట్లు కేటాయించింది మోదీ సర్కార్. ఏడాది లోపు డీపీఆర్‌ను పూర్తి చేసి, అనుమతులు కూడా సాధిస్తామని చెబుతున్నారు. ఇందుకోసం నేషనల్‌ హైవే ఇంజినీరింగ్‌ అధికారులు సర్వే కూడా మొదలుపెట్టారు.

బోధన్ నుంచి నిజామాబాద్ వరకు ఎన్‌హెచ్-63 ని విస్తరిస్తున్నారు.

బోధన్ నుంచి నిజామాబాద్ వరకు ఎన్‌హెచ్-63 ని విస్తరిస్తున్నారు. ఈ విస్తరణ నిజామాబాద్ సిటీ నుంచే మొదలు కావాల్సి ఉంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా రూపొందించారు. కాని, ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్నందున.. ప్లాన్ మార్చారు. నిజామాబాద్ రైల్వే కమాన్ వద్ద జీరో పాయింట్ నుంచి పనులు మొదలుపెడుతున్నారు. ఇక ఎడపల్లి మండల కేంద్రానికి సంబంధం లేకుండా బైపాస్‌ ఏర్పాటు చేసి, ఎన్‌హెచ్-63 నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బోధన్‌ శివారులోని సాలూర వద్ద మొదలవుతున్న ఈ రోడ్డు.. మానిక్‌భండార్‌ చెక్క వద్ద ప్రస్తుతం ఉన్న నేషనల్ హైవేకు కలుస్తుంది. మొత్తం 29 కిలోమీటర్ల రోడ్డు పనులకు గాను ఇప్పటికే 600 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రస్తుతం బోధన్‌ నుంచి జాన్కంపేట్‌ వరకు నాలుగు వరుసల రోడ్డు ఉంది. దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి కల్వర్టులను విస్తరిస్తున్నారు. జాన్కంపేట్‌ నుంచి నిజామాబాద్‌ నగరానికి సంబంధం లేకుండా మానిక్‌భండార్‌ వరకు రహదారిని నిర్మించేలా డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు బోధన్‌-బాసర-భైంసా జాతీయ రహదారి ముంజూరైంది

ఇక మద్నూర్‌ నుంచి బోధన్‌ వరకు నిర్మించే రోడ్డును 161 BB జాతీయ రహదారిగా విస్తరిస్తున్నారు. అయితే దీన్ని ఏయే మార్గాల గుండా వేయాలి, ఎక్కడెక్కడ ఎంత మేర భూసేకరణ చేయాలనే అంశాలపై అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు. మొత్తం 38.9 కిలోమీటర్ల మేర 10 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డును పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. మద్నూర్ నుంచి బోధన్ రూట్‌కు ఇప్పటికే 500 కోట్ల రూపాయలు కేటాయించారు. మరోవైపు బోధన్‌-బాసర-భైంసా జాతీయ రహదారి ముంజూరైంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ టెండరింగ్‌ దశలో ఉంది. 161 BB జాతీయ రహదారి కూడా పూర్తయితే మద్నూర్‌-భైంసా వరకు ఒకే రోడ్డు ఉంటుంది. ఇలా ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టులను పట్టుకొచ్చారు ఎంపీ అర్వింద్. మరి ఇన్నాళ్లుగా అర్వింద్‌పై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ చెంచాలు తలలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి. అభివృద్ది అనేది చేతల్లో ఉండాలి కాని టీఆర్ఎస్ నాయకుల్లాగా.. డబ్బాలో రాళ్లేసి ఊపినట్టు ఊకదంపుడు ఉపన్యాసాలలో కాదు..

Related Posts