Published On 19 Feb, 2022
ధర్పల్లి లో రేపు ప్రారంభించనున్న శివాజీ విగ్రహావిష్కరణ కి అనుమతి నిరాకరణ పై ఎంపీ అర్వింద్ కామెంట్స్

కేసీఆర్ పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నడు. హిందుత్వం, భారతీయ జనతా పార్టీ నా ప్రాంతంలో పెరుగుతుందని కేసీఆర్ కి వణుకు పుడుతున్నది.

ఇందూర్ లో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఆపడానికి ప్రత్యేకంగా పోలీస్ అధికారులను నియమించుకున్నరు. నన్ను భౌతికంగా ధర్పల్లి విగ్రహావిష్కరణకి వెళ్లకుండా ఆపగలరేమో కానీ, బిజెపి ఎదుగుదలను ఆపడం కెసిఆర్ తరం కూడా కాదు.

హిందుత్వం ఉప్పెనలా వస్తది, హిందూ వ్యతిరేకులంతా కొట్టుకుపోవడం ఖాయం. నెలల నుంచి కడుతున్నటువంటి విగ్రహానికి , ఇప్పుడు ఫిర్యాదు చేసుడేంది? దొంగ కంప్లైంట్లు పుట్టించి పోలీసులను వాడుకుంటున్నారు.

arvind dharmapuri bjp

Related Posts