బోర్డర్ టూరిజం దార్శనిక చొరవ ఫలితంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా ఇక్కడి నుంచి వలసలు ఆగిపోవడంతో ఈ ప్రాంత భద్రతకు బలం చేకూరుతోంది.
జైసల్మేర్‌లో బోర్డర్ టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, రూ.17.67 కోట్లతో శ్రీ తనోత్ మందిర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగింది.దీంతో ఇక్కడికి వచ్చే యువత శ్రీ తనోత్ మాతా ఆలయాన్ని సందర్శించడంతో పాటు మన వీర జవాన్ల పరాక్రమం, త్యాగాల చరిత్రను తెలుసుకోగలుగుతారు.
