
ఏం మాయరోగం వచ్చిందని ఇందిరా గాంధీ, దేశంలో ఎమర్జెన్సీ ఉన్న టైంల, 42వ రాజ్యాంగ సవరణ తెచ్చింది?? ‘సెక్యులార్’ పదాన్ని చేర్చాల్సినంత కొంప మునిగే అవసరమేమొచ్చింది??
జాతీయ సమైక్యతకు పాటు పడుతూ, దేశ విభజనను, పాకిస్థాన్(East & West)లో హిందువులపై జరిగిన మారణహోమంపై వ్యతిరేకించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు, నెహ్రూ ప్రభుత్వంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు..
కాశ్మీర్ కు ఎంట్రీ పాస్ అనేది దారుణమని, కాశ్మీర్ లోకి ప్రవేశించినందుకు నలభై రోజులకు పైగా జైలులో ఉంచగా, అనంతరం మరణించారు. ఇప్పటికి ఆయన మరణంపై చాలా సందేహాలున్నాయి.
Dr.అంబేద్కర్ గారి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, ఎమర్జెన్సీ విధించిన అనంతరం, ‘సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర‘ మైన మన దేశాన్ని ‘సార్వభౌమ,సోషలిస్ట్, సెక్యూలర్, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం‘ గా ఇందిరా గాంధీ మార్చారు.. ‘సెక్యూలర్’ పదాన్ని చేర్చేంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందో ఇప్పటికి ఎవరికీ అర్ధం కాలేదు.!!
ఈ ప్రశ్నలన్నీ సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, మెయిల్స్ ద్వారా యువరక్తం నన్ను ప్రశిస్తుంది.
ఆయన విరోధించిన ఆర్టికల్ 370 యొక్క రద్దు మరియు పాకిస్తాన్, బాంగ్లాదేశ్ , ఆఫ్ఘానిస్తాన్ లో ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలన్న ఆయన ఆశయాన్ని నెరవేరుస్తూ చేసిన CAA చట్టం పై పార్లమెంట్ లో ఓటు వేయడం అదృష్టంగా భావిస్తున్నాను..