సమాజంలో ఆధ్యాత్మికత పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ మతం ప్రకారం ఒక దేవుణ్ణి లేదా దేవతను అనుసరించడం దిన చర్యలో భాగమైంది. కొన్ని దశాబ్దాల నుంచి ఇది అధికమైంది.
దేశ గొప్ప ఇతిహాసమైన రామాయణాన్ని, అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణాన్ని, బిజెపి ఎంచుకోవడానికి అనేక కారణలు ఉన్నాయి. ప్రపంచానికి మరియు భారతీయ సమాజానికి రాముడు రోల్ మోడల్ అని పార్టీ భావించడమే అందులో ముఖ్యమైన కారణలలో ఒకటి.
అయితే బిజెపి పార్టీ రాజకీయాలు చూసి శ్రీకృష్ణుడిని బిజెపిని ఆరాధ్యదైవంగా ఎంచుకొందని ఆ పార్టీపై తమ శైలిలో విమర్శలు చేసేవారు లేకపోలేదు.
కాశీ, ఉజ్జయిని మహంకాళి ఆలయాల పునరుద్ధరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది.
తెలంగాణలో బీజేపీ ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు యాదగిరి గుట్టను యాదాద్రిగా పునర్నిర్మించారు. తెలంగాణ మోడల్ సెక్యులరిజం అంటూ కూడా ఆయన ఆధ్యాత్మికతను ప్రచారం చేశారు.యాదాద్రిని ప్రచారం చేయడంలో బిజెపి నేతలు కూడ ముందు వరసలో ఈ మధ్య చేరినట్టు కనిపిస్తోంది.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. ప్రధాని మోదీని రోల్ మోడల్‌గా ఎంచుకుని రాజకీయాల్లోకి వచ్చారు. అతను మోడీ డ్రెస్ కోడ్‌ని మెయింటెన్ చేస్తుంటారు. అతను ఇతర దుస్తులలో చాలా అరుదుగా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాడు. ఆయన భార్య శ్రీకృష్ణునికి బలమైన భక్తురాలు.
ఇదిలా ఉండగా అరవింద్ ధర్మపురి సోషల్ మీడియా బృందం కొన్ని నెలలుగా భగవాన్ వేదవ్యాసుడు మహా భాగవతం నుండి తెలుగు అనువాదంతో ట్విట్టర్‌లో రోజువారీ పోస్ట్‌లను పోస్ట్ చేయడం ప్రారంభించింది. భాగవతం భక్తుని కథలు మరియు శ్రీ కృష్ణ లీలల సమగ్ర స్వరూపం. మహా భాగవతం శుక మునిని పాదవుల మనవడు పరీక్షిత్తుకు చెప్పింది. అతను ధర్మరాజు వారసుడు. పరిక్షిత్ మాహారాజు కు ఏడు రోజుల్లో మరణం అనే శాపానికి గురయ్యాడు. ఈ రోజుల్లో అతను భాగవతం విన్నాడు మరియు మరణం అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి. చివరకు అన్నిరకాల భయాల నుంచి బయటపడ్డాడు. భాగవతం 12 స్కందాలుగా వ్రాయబడింది.
ఇప్పుడు అరవింద్ సోషల్ మీడియాలో ప్రథమ స్కంద పోస్ట్‌లు కొనసాగిస్తున్నారు. బృందం శ్లోకాలను మరియు పూర్తి అర్థాన్ని అందిస్తోంది. ఇది డైలీ సీరియల్ స్టోరీగా కొనసాగుతుంది.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడ ప్రజలు మహా భాగవతాన్ని పారాయణం చేయడం, భక్తితో వినడం అనేది ఇళ్ళలో సర్వసాధారణం. పారాయణ సందర్భంగా వర్ణించ అలివికానీ ఆనందాన్ని అనుభవిస్తారు.
హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ లలో రాజస్థాన్ మరియు గుజరాతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇది కాకుండా తెలుగు ఆధ్యాత్మిక సంఘాలు కూడా ప్రతిరోజూ పారాయణం మరియు సంవత్సరానికి ఒకసారి భాగవతం ప్రవచనం సప్తాహం కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రజలందరికీ తమ నాయకుడి సందేశాలు చేరవేయాలని మరియు యువ తరాలలో భాగవతం పట్ల ప్రజల్లో ఆసక్తిని కలిగించాలని అరవింద్ బృందం కోరుకుంటోంది. “భాగవతం కేవలం కథ మాత్రమే కాదు, ఇది యువ తరానికి వ్యక్తిత్వ వికాసం, విలువలు మరియు నైతికతతో కూడిన జీవితం, సమయపాలన, ఇతరుల మాదిరిగానే ఆదర్శవాదం వంటి అంశాలను విపులంగా వివరిస్తుంది” అని అరవింద్ సోషల్ మీడియా బృందంలో ఒకరు చెప్పారు. ట్విటర్ లో మెల్లగా ఫాలోయర్లు పెరుగుతున్నారు. తరతరాలుగా ప్రజలు తమ కుటుంబ సంప్రదాయాలుగా మహా భాగవతాన్ని కొనసాగించాలన్నదే మా ధ్యేయమని సభ్యుడు అన్నారు.
దేశం శతజయంతి స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే 2047 వరకు అధికారంలో కొనసాగాలని, అప్పటి వరకు దేశాన్ని అన్ని రంగాల్లో సూపర్ పవర్‌గా మార్చాలని బీజేపీ నేతలు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అప్పుడే దేశం విశ్వ గురువు అవుతుంది. విశ్వ గురువు స్థానాన్ని సాధించేందుకు తమ పాత్రను పోషించేలా ప్రజలను చైతన్యపరచాలని, ప్రేరేపించాలని సంఘపరివార్ సంస్థలు కార్యకర్తలకు పిలుపునిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వగురు నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు అరవింద్ ట్విట్టర్ వేదికను ఎంచుకున్నారు.
ట్విట్టర్‌లో ఏ భాషకైనా అనువాద సదుపాయం ఉంది, అందువల్లే వారు ట్విట్టర్‌ని ఎంచుకున్నారు.
అరవింద్ ధర్మపురికి కూడా తనదైన టార్గెట్స్ ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో అగ్రస్థానం సాధించాలని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.
మహా భాగవతం ట్విట్టర్‌లో మరికొన్ని సంవత్సరాలు కొనసాగుతుంది. అరవింద్ మరియు అతని బృందం మహా భాగవతం ముగిసిన తర్వాత వారు ఎలాంటి ఫలితాలను సాధిస్తారో కాలమే నిర్ణయిస్తుంది.
