*అర్సపల్లి ఆర్వోబి నిర్మాణానికి 137.50 కోట్లు మంజూరు*
*అందులో కేంద్ర వాటా 127.50 కోట్లు – ఎంపీ అర్వింద్*
మన్మాడ్ సికింద్రాబాద్ రైల్వే లైన్ మధ్య LC No 191 అర్సపల్లి వద్ద నాలుగు లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి 137.50 కోట్ల మంజూరు కు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అర్వింద్ పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ ఈ ఆర్వోబీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా కాలయాపన చేస్తుందని, తాను గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న వరుస విజ్ఞప్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 127.50 కోట్లు సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిందని, అందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అర్సపల్లి వద్ద 4 లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించి రైల్వే పనులకు 12 కోట్లు, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 115.50 కోట్లు మొత్తముగా 127.50 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. అప్రోచ్ లు మరియు బ్రిడ్జి నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టాలని, నిధులు మాత్రం కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ నుండి విడుదలవుతాయని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఈ ఆర్వోబీ నిర్మాణంలో భూసేకరణ ఇది వరకే పూర్తయిందని, ఇకనైనా మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించి తెలంగాణ ప్రభుత్వం నుండి పరిపాలన అనుమతులు త్వరగా ఇప్పించాలని ఎంపీ అర్వింద్ కోరినారు.
